ధర్మవరం రూరల్: మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని వడ్డే సౌజన్య (18) ఉరేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు సౌజన్య పట్టణంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
అయితే ఏమి జరిగిందేమోగానీ ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యా¯ŒSకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కుమార్తె ఫ్యా¯ŒSకు వేలాడుతూ కనిపించింది. రూరల్ ఎస్‌ఐ యతేంద్ర, ఏఎస్‌ఐ నాగప్ప వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.