కారు బోల్తా: దంపతులకు గాయాలు | couple injured of car rolls | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: దంపతులకు గాయాలు

Dec 25 2016 10:45 PM | Updated on Jul 10 2019 8:00 PM

మండలంలోని ఊబిచెర్ల శివార్లలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది.

గుత్తి రూరల్‌ : మండలంలోని ఊబిచెర్ల శివార్లలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో అనంతపురం ప్రశాంత్‌నగర్‌కు చెందిన ప్రొఫెసర్‌ అబ్దుల్‌ రహీం, ఆయన భార్య మెహజాన్‌బీ గాయపడ్డారు. అనంతపురం నుంచి వారు హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలోని ఊబిచెర్ల వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే వారిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోస వారిని కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement