రంగంపేటలో శవం లభ్యం | Corpse found in rangampeta | Sakshi
Sakshi News home page

రంగంపేటలో శవం లభ్యం

Jul 11 2016 2:56 PM | Updated on Jul 30 2018 8:29 PM

కొల్చారం మండలం రంగంపేట కొత్తచెరువు అలుగులోపల ఉన్న కాలువలో వడ్ల రాజశేఖర్(28) అనే వ్యక్తి శవం సోమవారం లభ్యమైంది.

కొల్చారం మండలం రంగంపేట కొత్తచెరువు అలుగులోపల ఉన్న కాలువలో వడ్ల రాజశేఖర్(28) అనే వ్యక్తి శవం సోమవారం లభ్యమైంది. రాజశేఖర్ స్వస్థలం కొల్చారం మండలం రంగంపేట. రాజశేఖర్ ఈ నెల 6 నుంచి కనపడటంలేదు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 9న ఫిర్యాదు చేశారు. సోమవారం అటుగా వెళ్తున్న స్థానికులకు వాసన రావడంతో ఈ విషయం బయటపడింది. ఎవరో వ్యక్తులు రాజశేఖర్‌ను హత్య చేసి కాలువలో పడేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement