
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి
రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను పక్కన పెట్టిన సీఎం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
- ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
ఖమ్మం: రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను పక్కన పెట్టిన సీఎం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల భూములను బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన 123 జీఓ చెంప పెట్టుగా ఉంటుందని, అధికారంతో ఏదైనా చేయవచ్చనే ఆలోచన మంచిది కాదన్నారు. ఒక వైపు రైతులకు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఎంసెట్–2 లీకేజీ అయ్యిందని,దీంతో రెండేళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుందని విమర్శించారు.ఎంసెట్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ,ఆరోగ్యశాఖ మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐతం సత్యం, పీసీసీ అధికార ప్రతినిధి కట్ల రంగారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు మనోహర్‌నాయుడు, జిల్లా మైనార్జీ నాయకులు ఫజల్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలాజీరావు నాయక్ పాల్గొన్నారు.