ఫాంహౌస్ నుంచే ఆరా తీస్తున్న కేసీఆర్‌ | cm kcr enquiring on ghmc elections from his farmhouse | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్ నుంచే ఆరా తీస్తున్న కేసీఆర్‌

Feb 2 2016 9:22 PM | Updated on Jul 11 2019 7:45 PM

ఫాంహౌస్ నుంచే ఆరా తీస్తున్న కేసీఆర్‌ - Sakshi

ఫాంహౌస్ నుంచే ఆరా తీస్తున్న కేసీఆర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచే ఆరా తీసినట్లు తెలిసింది.

జగదేవ్‌పూర్ (మెదక్): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచే ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కూడా వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యులుగా ఉన్న మంత్రి కేటీఆర్‌ కు ఫోన్‌ చేసి.. పోలింగ్ గురించి పూర్తి వివరాలు అడిగితెలుసుకున్నట్లు సమాచారం.

అలాగే ఉదయం సతీమణి శోభరాణితో కలిసి పంటలను పరిశీలించినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఫాంహౌస్ వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. శనివారం ఫామ్‌హస్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పంటలను పరిశీలిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిణామాలను ఆయన ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement