షాద్‌నగర్ : సెప్టెంబరు 2న నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సోమవారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజు ఆటోజాతాను జెండా ఊపి ప్రారంభించారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటోజాతా
Aug 29 2016 11:46 PM | Updated on Sep 4 2017 11:26 AM
	షాద్‌నగర్ : సెప్టెంబరు 2న నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సోమవారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజు ఆటోజాతాను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు, కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నారన్నారు. ప్రజా నిరసనను లెక్క చేయకుండా సంస్కరణలను మరింత దూకుడుగా అమలు చేస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్స్‌రెన్సు రంగంలోకి ఎఫ్‌డీఐ శాతాన్ని పెంచుతూ చట్టంలో మార్పు తీసుకొచ్చిందన్నారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎఫ్‌డీఐలను వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన అనంతరం విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నారన్నారు. దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రోజురోజుకు పరిశ్రమలు మూత పడుతున్నాయని దీంతో కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడుతున్నారన్నారు. సార్వత్రిక సమ్మెకు కార్మిక, ఉద్యోగ, నిరుద్యోగులు, మేధావులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాల్‌రెడ్డి, యాదగిరి, రాజశేఖర్, శ్రీనునాయక్, ఈశ్వర్, సుమన్, శివ, యాదిరెడ్డి, అజ్మీర్, శ్రీశైలం, యాదయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
