ప్రమాదవశాత్తు సంప్‌లో పడి ఓ రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. లింగాల మండలంలోని పద్మన్నపల్లికి చెందిన శ్రీలత, గోలి యాదవరెడ్డి దంపతులకు ఏకైక కుమారుడు మోహన్‌రెడ్డి (2) ఉన్నాడు. కాగా, గురువారం ఉదయం తమ కుమారుడిని తాత, నాయనమ్మ దగ్గర ఉంచి తల్లిదండ్రులు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు.
బాలుని మింగిన సంప్
Sep 30 2016 11:47 PM | Updated on Sep 4 2017 3:39 PM
లింగాల : ప్రమాదవశాత్తు సంప్‌లో పడి ఓ రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. లింగాల మండలంలోని పద్మన్నపల్లికి చెందిన శ్రీలత, గోలి యాదవరెడ్డి దంపతులకు ఏకైక కుమారుడు మోహన్‌రెడ్డి (2) ఉన్నాడు.
కాగా, గురువారం ఉదయం తమ కుమారుడిని తాత, నాయనమ్మ దగ్గర ఉంచి తల్లిదండ్రులు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం బాలుడు ఆరుబయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంప్‌లో పడి మృతి చెందాడు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన తాత, నాయనమ్మ విషయం తెలుసుకుని బోరుమన్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిని స్వగ్రామానికి వచ్చి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
Advertisement
Advertisement