జిల్లాలో ప్రజలు చికెన్ గున్యా వ్యాధితో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నెల్లూరు: జిల్లాలో ప్రజలు చికెన్ గున్యా వ్యాధితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలోనే సుమారు 100 మందికి చికెన్ గున్యా సోకినట్లు వ్యాధి నిర్ధారణ అయింది. బాధితులు నెల్లూరు, గూడూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు. సంబంధిత అధికారులు ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన కల్పించకపోవడం, సరైన చర్యలు తీసుకోకపోవడం మూలంగానే బాధితుల సంఖ్య పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.