
అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్.ఠాకూర్ దర్శించుకున్నారు.
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్.ఠాకూర్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం ఎదుట టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు.
కుంకుమార్చన సేవలో సతీసమేతంగా చీఫ్ జస్టిస్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, చిత్తూరు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో చీఫ్ జస్టిస్ దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు.