అమ్మో చిరుత ! | cheatah halchal in kuderu and settur | Sakshi
Sakshi News home page

అమ్మో చిరుత !

Apr 28 2017 11:11 PM | Updated on Sep 5 2017 9:55 AM

మొన్న కళ్యాణదుర్గం మండలం కేంద్రంలో చిరుత సంచారాన్ని మరువక ముందే తాజాగా శెట్టూరు మండలం యాటకల్లులో చిరుత సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది.

శెట్టూరు : మొన్న కళ్యాణదుర్గం మండలం కేంద్రంలో చిరుత సంచారాన్ని మరువక ముందే తాజాగా శెట్టూరు మండలం యాటకల్లులో చిరుత సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. శుక్రవారం యాటకల్లు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు సమీపంలోని స్టోన్‌ క్రషర్‌ గుట్ట వద్దకు ఉపాధి పనులకు వెళ్ళారు. గుట్టపై మేత మేస్తున్న మేకలను పట్టుకోవడానికి చిరుత పై నుంచి రావడాన్ని గుర్తించిన పశువుల కాపరులు, గుట్ట సమీపంలోని కూలీలకు విషయాన్ని తెలిపారు. స్థానికులు అరుపులు, కేకలు వేయడంతో మేకల కోసం వచ్చిన చిరుత గుట్టపైకి వెళ్లిందని కూలీలు చెప్పారు.ఏ క్షణాన ఏం జరుగుతుందోనని యాటకల్లు, అడవి గొల్లపల్లి గ్రామాల జనం ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement