దేవాదులకాల్వలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన వనమాల కనపర్తిలో శనివారం జరి గింది. స్థానికుల కథనం ప్రకా రం.. హన్మకొండ మండలం వనమాల కనపర్తికి చెం దిన వేముల రవి, హరిత దంపతుల కుమారుడు యోగేశ్వర్(9) శుక్రవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్తున్నానని ఇంట్లో చె ప్పి తిరిగి రాలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో వెతికారు. పక్కన ఉన్న దే వాదుల కాల్వ వద్ద అతడి దుస్తులు కని పించడంతో కాల్వలో పడి ఉండొచ్చనే అనుమానంతో అ
దేవాదుల కాల్వలో పడి బాలుడి మృతి
Sep 25 2016 12:54 AM | Updated on Jul 12 2019 3:02 PM
మడికొండ : దే వాదులకాల్వలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన వనమాల కనపర్తిలో శనివారం జరి గింది. స్థానికుల కథనం ప్రకా రం.. హన్మకొండ మండలం వనమాల కనపర్తికి చెం దిన వేముల రవి, హరిత దంపతుల కుమారుడు యోగేశ్వర్(9) శుక్రవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్తున్నానని ఇంట్లో చె ప్పి తిరిగి రాలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో వెతికారు. పక్కన ఉన్న దే వాదుల కాల్వ వద్ద అతడి దుస్తులు కని పించడంతో కాల్వలో పడి ఉండొచ్చనే అనుమానంతో అధికారులకు సమాచారమిచ్చా రు.
శుక్రవారం కుమ్మరిగూడెం శివారు మల్లక్‌పల్లి దగ్గరలోని గండిచెరువుకు గండి పడటంతో చెరువు నీళ్లు కాల్వలోకి రావడంతో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు కాల్వ గేట్లను మూసివేయడంతో శనివారం ఉదయం వెతకగా బాలుడి మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. కళ్లెదుటే కుమారుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యా రు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement