'ఆరునూరైనా జగన్ దీక్ష జరుగుతుంది' | bothsa statement on ys jagan deeksha | Sakshi
Sakshi News home page

'ఆరునూరైనా జగన్ దీక్ష జరుగుతుంది'

Sep 24 2015 2:57 PM | Updated on Jul 28 2018 6:48 PM

'ఆరునూరైనా జగన్ దీక్ష జరుగుతుంది' - Sakshi

'ఆరునూరైనా జగన్ దీక్ష జరుగుతుంది'

ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.

గుంటూరు: ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల నిబంధనలకు అనుగుణంగానే దీక్షాస్థలిలో నడుచుకుంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని.. వాస్తవానికి ఈ పనులన్నీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

రాజకీయాలు, వ్యాపారాల కోసం కేంద్రంలో చంద్రబాబు లాలూచీ పడ్డారని బొత్స విమర్శించారు. దీక్షకు సంబంధించి 3 ప్రదేశాలు సూచించినా చంద్రబాబు కాదనటం దారుణమన్నారు. నాలుగో దీక్షాస్థలికి కూడా అభ్యంతరం పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. దీక్ష జరగాల్సిన ప్రదేశంలో ఇప్పటికే అనేక సార్లు ఎగ్జిబిషన్లు జరిగాయని తెలిపారు. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని బొత్స సత్యానారాయణ  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement