రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు ఈ నెల 31న టీఎస్సార్ అండ్ రారాజు జిమ్‌లో ఎంపిక చేయనున్నట్లు విశాఖ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజారావు తెలిపారు.
31న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక
Jul 27 2016 1:37 AM | Updated on Apr 3 2019 5:45 PM
పెదగంట్యాడ: రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు ఈ నెల 31న టీఎస్సార్ అండ్ రారాజు జిమ్‌లో ఎంపిక చేయనున్నట్లు విశాఖ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజారావు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 28న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. చాంపియన్ ఆఫ్ ది చాంపియన్‌కు రూ. 20 వేలు, బెస్ట్ పోజర్‌కు రూ. 10 వేలు నగదు బహుమతి అందించనున్నారని తెలిపారు. ఆసక్తి గల వారు జిమ్ నిర్వాహకులను సంప్రదించాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు డిసెంబర్‌లో కర్ణాటకలోని బెలగాంలో జరగనున్న పోటీలకు ఎంపికవుతారని తెలిపారు.
Advertisement
Advertisement