బత్యాలకు త్రుటిలో తప్పిన ప్రమాదం | bathyala safe about small accident | Sakshi
Sakshi News home page

బత్యాలకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Mar 21 2016 3:26 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుకు ఆదివారం త్రుటిలో ప్రమాదం తప్పింది.

పెనగలూరు: ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుకు ఆదివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ట్రాక్టర్ ఢీకొం ది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వివరాల్లోకెళితే.. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ప్రయాణిస్తున్న కారును ఆదివారం సాయంత్రం పెనగలూరు మండలంలోని బెస్తపల్లి వద్ద ఓ ట్రాక్టర్ ఢీకొంది.  సుమారు 15 అడుగుల దూరం మేర బత్యాల వాహనాన్ని ట్రాక్టర్ ఈడ్చుకుంటూ వెళ్లింది. కారు తలుపులు, ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాద దృశ్యాన్ని చూస్తే కారులో ఉన్న వారికి తీవ్రగాయాలు అయి ఉంటాయని భావిస్తారు. అయితే కారులో ఉన్నవారికి చిన్నపాటి గాయాలు కూడా కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement