అంతర్‌ కళాశాలల బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం | badmintan intercollegeat competations | Sakshi
Sakshi News home page

అంతర్‌ కళాశాలల బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

Sep 9 2016 11:03 PM | Updated on Sep 4 2017 12:49 PM

అంతర్‌ కళాశాలల బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

అంతర్‌ కళాశాలల బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

ఏఎన్‌యూ(గుంటూరు) : యూనివర్సిటీ స్థాయి అంతర్‌ కళాశాలల బ్యాడ్మింటన్‌ పురుషుల, మహిళల పోటీలు శుక్రవారం ఏఎన్‌యూ క్రీడామైదానంలో ప్రారంభమయ్యాయి.

  
ఏఎన్‌యూ(గుంటూరు) : యూనివర్సిటీ స్థాయి అంతర్‌ కళాశాలల బ్యాడ్మింటన్‌ పురుషుల, మహిళల పోటీలు శుక్రవారం ఏఎన్‌యూ క్రీడామైదానంలో ప్రారంభమయ్యాయి. పోటీలను ఏఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఆచార్య వై.కిషోర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకుని రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. యోగా కోర్సు కోఆర్డినేటర్‌ డి.సూర్యనారాయణ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.జాన్సన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ కళాశాలల జట్ల మధ్య పోటీలు నిర్వహించారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement