విద్యార్థినుల ఆకలి కేకలు | bad situation in nellore hostel | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల ఆకలి కేకలు

Sep 4 2015 10:36 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో రెండు రోజుల నుంచి అన్నం పెట్టకపోవడంతో.. విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోతున్నారు.

వెంకటగిరి(నెల్లూరు): నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో రెండు రోజుల నుంచి అన్నం పెట్టకపోవడంతో.. విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. గురువారం రాత్రి నుంచి బాలికలకు భోజనం పెట్టకపోవడంతో.. పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వసతి గృహ వార్డెన్ బదిలి కావడంతో.. ఆయన స్థానంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారు వసతి గృహానికి రాకపోవడంతోనే విద్యార్థినులకు ఈ పరిస్థితి ఎదురవుతోందని.. వార్డెన్ రేషన్ ఇవ్వకపోవడంతోనే తాము వంట చేయడం లేదని వంటవాళ్లు అంటున్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారనే విషయం తెలిసిన స్థానిక వ్యక్తి ఐదు కేజీల బియ్యం పంపడంతో.. ఇప్పుడే భోజనం వండారు.. కానీ వసతి గృహంలో 120 మంది బాలికలు ఉండటంతో ఐదుకిలోల బియ్యం ఎవరికి సరిపోలేదు.. ఆకలికి తట్టుకోలేని పసి హృద యాలు కడుపుమంటతో క ళ్లు తరిగి పడిపోతుండటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement