మనస్తాపంతో రైలు కిందపడి విద్యార్థి మృతి | b pharmacy student suicide on railway track | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో రైలు కిందపడి విద్యార్థి మృతి

Nov 4 2015 5:37 PM | Updated on Nov 6 2018 7:56 PM

కాలేజీ అటెండెన్స్ తక్కువ కారణంగా ల్యాబ్ ఎగ్జామ్కు అనుమతించననడంతో బీ.ఫార్మశీ విద్యార్ధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

మేడ్చెల్: కాలేజీ అటెండెన్స్ తక్కువ కారణంగా ల్యాబ్ ఎగ్జామ్కు అనుమతించననడంతో బీ.ఫార్మశీ విద్యార్ధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

మేడ్చెల్ సీఎంఆర్ ఫార్మశీ కాలేజీలో కుత్బుల్లాపూర్కు చెందిన ఆదినారాయణమూర్తి కుమారుడు సీఎంఆర్ ఫార్మశీ కాలేజీ బీ.ఫార్మశీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీకు సరిగా రాకపోవడంతో హాజరుశాతం బాగా తగ్గడంతో ప్రిన్సిపాల్ మందలించి ల్యాబ్ పరీక్షలకు అనుమతించేదిలేదని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన భార్గవనాయుడు ఆదివారం సాయంత్రం నాంపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

గుర్తు తెలియని శవంగా భావించిన పోలీసులు విచారణ చేపట్టారు. శవం ఫార్మసీ విద్యార్థి భార్గవ్‌దిగా మంగళవారం సాయంత్రం గుర్తించారు. దాంతో ఆగ్రహించిన కళాశాల విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement