డీపీఓలో ఆయుధాల ప్రదర్శన | arms exhibition at dpo | Sakshi
Sakshi News home page

డీపీఓలో ఆయుధాల ప్రదర్శన

Oct 16 2016 11:43 PM | Updated on Aug 21 2018 5:54 PM

డీపీఓలో ఆయుధాల ప్రదర్శన - Sakshi

డీపీఓలో ఆయుధాల ప్రదర్శన

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్‌ మైదానంలో ఆయుధాల ప్రదర్శనను కుటుంబ సమేతంగా ఎస్పీ ఆకె రవికృష్ణ ప్రారంభించారు.

కర్నూలు: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్‌ మైదానంలో ఆయుధాల ప్రదర్శనను కుటుంబ సమేతంగా ఎస్పీ ఆకె రవికృష్ణ ప్రారంభించారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు కార్బన్, పిస్టల్స్, ఏకె–47, 9 ఎంఎ పిస్టల్, ఎల్‌ఎంజీ, బాంబ్‌ డిస్పోజబుల్‌ పరికరాలు, గ్రెనైడ్, గ్యాస్‌ గన్ను తదితర ఆయుధాయులను ఎస్పీ పరిశీలించారు. ఆయుధాల పనితీరు గురించి పాఠశాల విద్యార్థులకు ఎస్పీ తెలియజేశారు. వజ్ర, ల్యాండ్‌ మైన్‌ ఫ్రూవ్‌ వాహనాలు ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భఃగా వీక్షకులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. దేశభద్రత, సమాజ రక్షణ కోసం పోలీసులు వినియోగించే ఆయుధాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. పోలీసు కుటుంబాలు, వారి పిల్లలు ఓపెన్‌హౌస్‌ ఎగ్జిబిషన్‌లో విధిగా పాల్గొనాలని సూచించారు. ఈ ప్రదర్శణమరో నాలుగు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. సామాన్య ప్రజలు, విద్యార్థుల్లో పోలీసులపై భయాన్ని పోగొట్టి స్నేహ భావాన్ని పెంపొందించేందుకే ఈ ప్రదర్శణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, బాబుప్రసాద్, సీఐలు డేగల ప్రభాకర్, మధుసూదన్‌రావు, మహేశ్వరరెడ్డి, కృష్ణయ్య, శ్రీనివాసులు, రామాంజనేయులు, ఆర్‌ఐలు రంగముని, జార్జ్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement