పెద్దనోట్ల రద్దుపై చర్చించడానికి ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు ఎందుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరా రెడ్డి ప్రశ్నించారు.
'ఆయన ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు'
Dec 12 2016 5:32 PM | Updated on Aug 18 2018 9:05 PM
విజయవాడ: పెద్దనోట్ల రద్దుపై చర్చించడానికి ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు ఎందుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరా రెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుపై బీజేపీ వద్ద సమాధానం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు వెనక పెద్ద మాఫియా ఉందన్నారు.
పెద్ద నోట్ల రద్దు సామాన్యులకు శాపం..బీజేపీ, టీడీపీల సంబంధించిన నాయకులకు వరం అయిందన్నారు. త్వరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రాజకీయాలకు అతీతంగా పెద్దనోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న వివిధ రంగాలకు చెందిన వారితో ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement