తెలంగాణ ఉద్యోగులపై ఏపీ చర్యలు! | andhra pradesh take action against telangana employees | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యోగులపై ఏపీ చర్యలు!

Nov 5 2016 12:10 AM | Updated on Sep 4 2017 7:11 PM

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి స్వచ్ఛందంగా రిలీవ్ అయిన 152 మంది ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ విద్యుత్ అధికారులు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి స్వచ్ఛందంగా రిలీవ్ అయిన 152 మంది ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ విద్యుత్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని తెలంగాణ విద్యుత్ ఉన్నతాధికారులకు తెలిపారు. తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేయలేమని రెండు నెలల కిందట స్వచ్ఛందంగా వెళ్లిపోయారు. వీరికి తెలంగాణ విద్యుత్ సంస్థలు పోస్టింగ్‌లు ఇచ్చాయి. అయితే, సర్వీస్ రికార్డు, పీఎఫ్ ఖాతాలు ఏపీలోనే ఉన్నాయి.

వీటిని తమకు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు కోరినప్పటికీ ఏపీ అధికారులు నిరాకరించారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయి విభజన జరగలేదని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, స్వచ్ఛందంగా రిలీవ్ అవ్వడం చట్టవ్యతిరేకమని ఏపీ అధికారులు తెలంగాణకు తెలిపారు. వెళ్లిపోయిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే... తెలంగాణకు వెళ్ళిపోయిన ఉద్యోగులు శుక్రవారం ట్రాన్స్‌కో జేఎండీ దినేష్ పరుచూరిని కలిశారు. తమ రికార్డులు తెలంగాణకు అప్పగించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement