బిగ్‌ ఫ్లైట్‌ పోటీలో అఖిల్‌ ప్రతిభ | akhil show best performence in big fligth game | Sakshi
Sakshi News home page

బిగ్‌ ఫ్లైట్‌ పోటీలో అఖిల్‌ ప్రతిభ

Jul 27 2016 9:56 PM | Updated on Sep 4 2017 6:35 AM

బిగ్‌ ఫ్లైట్‌ పోటీలో అఖిల్‌ ప్రతిభ

బిగ్‌ ఫ్లైట్‌ పోటీలో అఖిల్‌ ప్రతిభ

చింతలపూడి: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి కొత్తపల్లి అఖిల్‌ (6వ తరగతి)కు ఈనెల 29న గన్నవరం నుంచి హైదరాబాద్‌ విమానంలో Ðð ళ్లే అవకాశం కల్పించినట్టు ప్రిన్సిపాల్‌ బి.రాజారావు బుధవారం తెలిపారు. గత నెలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బిగ్‌ ఫై ్లట్‌ టికెట్‌ పోటీల్లో అఖిల్‌ ప్రథమ బహుమతి సాధించాడన్నారు.

చింతలపూడి: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి కొత్తపల్లి అఖిల్‌ (6వ తరగతి)కు ఈనెల 29న గన్నవరం నుంచి హైదరాబాద్‌ విమానంలో వెళ్లే అవకాశం కల్పించినట్టు ప్రిన్సిపాల్‌ బి.రాజారావు బుధవారం తెలిపారు. గత నెలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బిగ్‌ ఫ్లైట్‌ టికెట్‌ పోటీల్లో అఖిల్‌ ప్రథమ బహుమతి సాధించాడన్నారు.

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉన్న విద్యార్థులను గుర్తించి గుంటూరు ఆర్‌కే పురం గురుకుల పాఠశాలలో గతనెల 29న పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన అఖిల్‌కు ప్రభుత్వం గన్నవరం నుంచి హైదరాబాద్‌ విమానంలో తీసుకు వెళ్లి చారిత్రక ప్రదేశాలను తిలకించే ఏర్పాట్లు చేసిందన్నారు.  అఖిల్‌ను సాగనంపడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు కుటుంబరావు, కమలారత్నం మాట్లాడుతూ విమానాన్ని ఆకాశంలో వెళ్తుండగా చూడటమే తప్ప తమ బిడ్డ విమానంలో ప్రయాణిస్తాడని ఎన్నడూ ఊహించలేదని అన్నారు. 
 
 
 
 
 
 
 
 

Advertisement

పోల్

Advertisement