లారీ బోల్తా.. ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు | Accident In East Godavari District | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా.. ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు

Apr 19 2017 8:06 AM | Updated on Sep 5 2017 9:11 AM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి

తుని(తూర్పుగోదావరి): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలం పేటగుంట వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

జిప్సం లోడుతో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ పేటగుంట వద్దకు రాగానే ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లోడుపై కూర్చొని ప్రయాణిస్తున్న వారిలో పాములూరి వీరేంద్ర(33) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుదని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement