సెల్‌ఫోన్‌ తెచ్చిన ప్రమాదం | ACCIDENT DUE TO CELL PHONE | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ తెచ్చిన ప్రమాదం

Aug 7 2016 6:42 PM | Updated on Sep 4 2017 8:17 AM

సెల్‌ఫోన్‌ తెచ్చిన ప్రమాదం

సెల్‌ఫోన్‌ తెచ్చిన ప్రమాదం

జగన్నాథపురం (గోపాలపురం): మండలంలోని జగన్నాథపురం శివారులో ఆగిఉన్న లారీని సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వేగంగా బైక్‌తో ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.

జగన్నాథపురం (గోపాలపురం): మండలంలోని జగన్నాథపురం శివారులో ఆగిఉన్న లారీని సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వేగంగా బైక్‌తో ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గోపాలపురం బీసీ కాలనీకి చెందిన పాతాళ తేజ, కాకులేటి శ్యామ్‌ ఆదివారం ఉదయం ఎలక్ట్రికల్‌ సామగ్రి కొనుగోలు చేసేందుకు బైక్‌పై కొయ్యలగూడెం వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బైక్‌ను వేగంగా నడుపుతున్న శ్యామ్‌ జగన్నాథపురం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో శ్యామ్‌కు బలమైన గాయం కాగా తేజకు కాలు విరిగింది. స్థానికులు క్షతగాత్రులను 108లో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా శ్యామ్‌ను ఏలూరు, తేజను రాజమండ్రి మెరుగైన ౖవైద్యం కోసం పంపినట్టు బంధువులు తెలిపారు. తేజ రాజమండ్రి గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం, కాకులేటి శ్యామ్‌ జంగారెడ్డిగూడెంలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గోపాలపురం హెడ్‌ కానిస్టేబుల్‌ కె.మురళీకష్ణ తెలిపారు. 
 
 

Advertisement
Advertisement