తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిపింది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ గురువారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో కార్యాలయంలో అదనంగా ఉన్న రూ. 70 వేల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతో పాటు కార్యాలయంలో ఉన్న ఏడుగురు బయటి వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.