300 మంది వైఎస్సార్‌ సీపీలో చేరిక | 300 members joind in ysrcp | Sakshi
Sakshi News home page

300 మంది వైఎస్సార్‌ సీపీలో చేరిక

Oct 2 2016 10:49 PM | Updated on Sep 4 2017 3:55 PM

300 మంది వైఎస్సార్‌ సీపీలో చేరిక

300 మంది వైఎస్సార్‌ సీపీలో చేరిక

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవినీతి, అసమర్థ పాలనతో విసుగు చెందిన ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్‌ అన్నారు. కె.ఏనుగుపల్లి శెట్టిబలిజపాలెంలో గత 30 ఏళ్లుగా టీడీపీలో కొనసాగిన 100 కుటుంబాలకు చెందిన 300 మంది కార్యకర్తలు ఆదివారం కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, జిల్లా

కె.ఏనుగుపల్లి (పి.గన్నవరం) : 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవినీతి, అసమర్థ పాలనతో విసుగు చెందిన ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్‌ అన్నారు. కె.ఏనుగుపల్లి శెట్టిబలిజపాలెంలో గత 30 ఏళ్లుగా టీడీపీలో కొనసాగిన 100 కుటుంబాలకు చెందిన 300 మంది కార్యకర్తలు ఆదివారం కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దొమ్మేటి వెంకట శివరామన్‌ల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. శెట్టిబలిజ నాయకులు సానబోయిన వెంకటరత్నం (బుజ్జి), దొమ్మేటి వెంకటరమణ, గుడాల పెద్దిరాజు, సానబోయిన గోపాలకృష్ణ, ఎస్‌.ప్రసాద్, దొమ్మేటి ఏడుకొండలు, బండారు సాయిబాబు, కాండ్రేగుల ధర్మారావు, మట్టపర్తి ఏడుకొండలు, సానబోయిన గోవిందరావు తదితరులకు చిట్టబ్బాయి, మోహన్, చిట్టిబాబు వైఎస్సార్‌ సీపీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మండలశాఖ  అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్‌ను నమ్మి పార్టీలో చేరిన కార్యకర్తలను అభినందించారు. చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాక ఎన్నో కొత్త సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించనున్నారని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement