గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పెద్దనాపల్లి గ్రామానికి చెందిన పార్టీ నేతలు శెట్టి బుజ్జి, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కో ఆర్డినేటర్ పర్వతప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోకి
వైఎస్సార్ సీపీలో 100 మంది మహిళల చేరిక
Dec 26 2016 11:09 PM | Updated on Sep 4 2017 11:39 PM
పెద్దనాపల్లి (ఏలేశ్వరం) :
గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పెద్దనాపల్లి గ్రామానికి చెందిన పార్టీ నేతలు శెట్టి బుజ్జి, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కో ఆర్డినేటర్ పర్వతప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పర్వతప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విసుగుచెందిన ప్రజ లు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. దివంగత నేత వైఎస్సార్ పాలన రావాలంటే జగ¯ŒSను ముఖ్యమంత్రిని చేయాలని అన్నివర్గాల ప్రజలు భావిస్తున్నారన్నారు. పార్టీ జిల్లాకార్యనిర్వహక కార్యదర్శి అలమండ చలమయ్య, సామంతుల సూర్య కుమార్, సూతి ప్రసాద్, పల్లెల బ్రహ్మజీ రావు, వాగు బలరామ్, దాసరి రమేష్, చెవల పాపారావు, నీరుకొండ అర్జునరావు, శిడగం రాజేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement