ఆళ్ళపాడులో 27 మందికి డెంగీ | 27 villagers of aallapaadu affected with dengue | Sakshi
Sakshi News home page

ఆళ్ళపాడులో 27 మందికి డెంగీ

Aug 30 2016 11:48 PM | Updated on Sep 4 2017 11:35 AM

రోగుల ఇళ్ళ వద్దకు వెళ్ళి నీటి తొట్లను పరిశీలిస్తున్న డీఎంఅండ్‌హెచ్‌ఓ

రోగుల ఇళ్ళ వద్దకు వెళ్ళి నీటి తొట్లను పరిశీలిస్తున్న డీఎంఅండ్‌హెచ్‌ఓ

ఆళ్ళపాడు గ్రామంలో 27మందికి డెంగీ జ్వరం సోకినట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎం అండ్‌ హెచ్‌ఓ) డాక్టర్‌ ఎ.కొండలరావు చెప్పారు.

  • డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ కొండలరావు
  • ఆళ్లపాడు: ఆళ్ళపాడు గ్రామంలో 27మందికి డెంగీ జ్వరం సోకినట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎం అండ్‌ హెచ్‌ఓ) డాక్టర్‌ ఎ.కొండలరావు చెప్పారు. ‘జ్వరాలపై జాడ్యం’ శీర్షికన ఈ నెల 29న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి, ఆళ్ళపాడు గ్రామాన్ని సందర్శించారు. రోగుల వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని సర్పంచ్‌ వేల్పుల ఆనందరావు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మిని ఆదేశించారు.

    గ్రామంలోని రోడ్లు బురదగా ఉండటం, నీటి తొట్లలో నీరు నిల్వ ఉండటం, బహిరంగ మల విసర్జనతో నీటి కాలుష్యం ఫలితంగా దోమలు పెరిగి డెంగీ, విష జ్వరాలు వచ్చాయని అన్నారు. గ్రామంలో 37 మంది జ్వర పీడితుల నుంచి నమూనాలు తీసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామని, వీరిలో 27 మందికి డెంగీ పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. జ్వరాలు పూర్తిగా తగ్గేంత వరకు గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించాలని మండల వైద్యాధికారి డాక్టర్‌ బాలాజీని ఆదేశించారు. డీఎం అండ్‌ హెచ్‌ఓ వెంట జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రాంబాబు, ఐడీఎస్‌పీ కోటిరత్నం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement