breaking news
allapadu
-
రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు నిలిపివేత..
-
చుక్కలు చూపించిన గూడ్స్ రైలు...
సాక్షి, కృష్ణా : కైకలూరు మండలం ఆలపాడు రైల్వే క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ఇంజన్లో నుంచి అనూహ్యంగా పొగలు రావడంతో ఉదయం 9 గంటలకు ఆలపాడు రైల్వే గేట్ నెంబర్ 93 దగ్గర రైలును నిలిపివేశారు. దీంతో పామర్రు నుంచి కత్తిపూడి(165) జాతీయరహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇరువైపులా రాకపోకలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా..సమాచారం తెలుసుకున కైకలూరు రూరల్ పోలీసులు, రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. -
ఆళ్ళపాడులో 27 మందికి డెంగీ
డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కొండలరావు ఆళ్లపాడు: ఆళ్ళపాడు గ్రామంలో 27మందికి డెంగీ జ్వరం సోకినట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎం అండ్ హెచ్ఓ) డాక్టర్ ఎ.కొండలరావు చెప్పారు. ‘జ్వరాలపై జాడ్యం’ శీర్షికన ఈ నెల 29న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి, ఆళ్ళపాడు గ్రామాన్ని సందర్శించారు. రోగుల వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని సర్పంచ్ వేల్పుల ఆనందరావు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మిని ఆదేశించారు. గ్రామంలోని రోడ్లు బురదగా ఉండటం, నీటి తొట్లలో నీరు నిల్వ ఉండటం, బహిరంగ మల విసర్జనతో నీటి కాలుష్యం ఫలితంగా దోమలు పెరిగి డెంగీ, విష జ్వరాలు వచ్చాయని అన్నారు. గ్రామంలో 37 మంది జ్వర పీడితుల నుంచి నమూనాలు తీసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామని, వీరిలో 27 మందికి డెంగీ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. జ్వరాలు పూర్తిగా తగ్గేంత వరకు గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించాలని మండల వైద్యాధికారి డాక్టర్ బాలాజీని ఆదేశించారు. డీఎం అండ్ హెచ్ఓ వెంట జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు, ఐడీఎస్పీ కోటిరత్నం తదితరులు ఉన్నారు.