భారీగా రేషన్ బియ్యం పట్టివేత | 17.50 tons of ration rice seized | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Sep 26 2016 4:40 PM | Updated on Sep 4 2017 3:05 PM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

నార్కట్‌పల్లి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తిరుమలగిరికి చెందిన సంతోష్ రైస్ మిల్లు యజమాని అక్రమంగా కొనుగోలు చేసిన 350 బస్తాల్లో ఉన్న 17.50 టన్నుల బియ్యాన్ని లారీలో కర్ణాటకకు తరలించేందుకు యత్నించారు.

ఈ మేరకు ముందస్తు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు.. సోమవారం మధ్యాహ్నం లారీని నార్కట్‌పల్లి సమీపంలో అడ్డుకుని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న రేషన్ బియ్యం బయటపడింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోదాముకు తరలించారు. లారీని సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement