జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

Suspected Jaish Terrorist From Srinagar Arrested In Delhi - Sakshi

న్యూఢిల్లీ : పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో దోషిగా తేలిన ఉగ్రవాది బసీర్‌ అహ్మద్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతను శ్రీనగర్‌ నుంచి వచ్చిన జైషే ఉగ్రసంస్థ సభ్యుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటి కమిషనర్‌ (స్పెషల్‌ సెల్‌) సంజీవ్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..  2007లో బసీర్‌ ఢిల్లీ పోలీసులపై కాల్పులు జరిపాడన్న ఆరోపణలపై అరెస్టయ్యాడు. అయితే, కింది కోర్టు నిర్దోషిగా తేల్చడంతో విడుదలై బయటికొచ్చాడు. ఈ తీర్పుపై పోలీస్‌శాఖ హైకోర్టును ఆశ్రయించగా అతన్ని దోషిగా తేల్చింది. కానీ, బసీర్‌ కోర్టులో లొంగిపోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో హైకోర్టు అతనిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. పక్కా సమాచారంతో బసీర్‌ను, అతనితోపాటు ఉన్న ఫయాజ్‌, మాజిద్‌ బాబాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Read latest Delhi News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top