ప్రియుడి ఇంటి ఎదుట యువతి నిరసన

Young Women Protest In Front Of Boyfriend Home Prakasam - Sakshi

ప్రకాశం, మార్కాపురం: కోచింగ్‌ సెంటర్‌లో పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి ఇప్పుడు ముఖం చాటేశాడంటూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీ ప్రాంతంలో ఉన్న రామాలయం వెనుక వీధిలో జరిగింది. వివరాలు.. అర్ధవీడు మండలం కాకర్లకు చెందిన దండు ప్రియాంక మార్కాపురంలోని ఓ కోచింగ్‌ సెంటర్‌కు ఉద్యోగ శిక్షణకు వెళ్తోంది.

అక్కడ మహేష్‌ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తాను ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నాడని ప్రియాంక ఆరోపిస్తోంది. మహేష్‌ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. పోలీసులు సమాచారం అందుకుని ఆమెను పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. తల్లిదండ్రులు యాకోబు, రంగమ్మలు తమ కుమార్తెకు న్యాయం చేయాలని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్‌ఐ కోటయ్యను వివరణ కోరగా కేసు విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top