
జంతువు దాడిలో మరణించిన గొర్రెలు
రామయంపేట(మెదక్): మండలంలోని సుతార్‌పల్లి గ్రామంలో రాగి పెద్ద అంజయ్యకు చెందిన నాలుగు గొర్రెలను గుర్తు తెలియని జంతువులు హతమార్చాయి. అంజయ్య తన గొరెల్రను వ్యవసాయ బావి వద్ద కొట్టంలో ఉంచగా, గుర్తు తెలియని జంతువు హతమార్చింది. చిరుత పులి దాడి చేసినట్లు బాధితుడు పేర్కోనగా, ఇది చిరుత దాడి కాదని అటవీ శాఖ డీప్యూటీ రెంజ్ అధికారి కుతుబోద్దీన్ పేర్కోన్నారు. బాధితుణ్ణి ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.