
సిద్దిపేట : రైతులు అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సిద్దిపేటరూరల్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, చింతమడకలో ఇలా రంగు రంగు చీరలను పంట చుట్టూ కడుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా పాత చీరలను కొనుగోలు చేస్తున్నారు. ఇలా చీరలు కట్టడం వల్ల అడవి జంతువులు భయపడి చేనులోకి రావట్లేదని రైతులు ఆనందంగా చెబుతున్నారు.