ప్లస్‌ ఒన్‌ విద్యార్థినిపై కవలల లైంగిక దాడి | Twin Brothers Molestation on Oneplus Student in Tamil nadu | Sakshi
Sakshi News home page

ప్లస్‌ ఒన్‌ విద్యార్థినిపై లైంగిక దాడి

Oct 17 2019 7:37 AM | Updated on Oct 17 2019 7:37 AM

Twin Brothers Molestation on Oneplus Student in Tamil nadu - Sakshi

తమిళనాడు,అన్నానగర్‌: ఉసిలంపట్టి సమీపంలో మంగళవారం ప్లస్‌ వన్‌ విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కవలలను పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలోని ఓ తోటకి మంగళవారం ఉదయం స్నానం చేయడానికి వెళ్లిన ప్లస్‌ వన్‌ విద్యార్థిని రక్తపు మడుగులో హత్యకు గురైంది. దీని గురించి సమాచారం అందుకున్న సేడపట్టి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉసిలంపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి పేరైయూర్‌ పోలీసు జాయింట్‌ సూపరింటెండెంట్‌ మదియళగన్‌ కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇందులో ఓనాపట్టికి చెందిన అమ్మవాసి కుమారుడు మాధవన్‌ (24) చిక్కాడు. ఇతని వద్ద పోలీసులు తీవ్ర విచారణ చేశారు. ఇందులో మాధవన్, తన సోదరుడు మధు ఇద్దరు విద్యార్థిని బెదిరించి ఎవరు లేని స్థలానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయట తెలిస్తే ప్రమాదం అని భావించిన ఇద్దరు ఆ విద్యార్థిన్ని గొంతు నులిమి, తలపై రాయి వేసి హత్య చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని బావి ప్రాంతంలో విసిరేసి పరారైనట్లు తెలిసింది. మాధవన్, మధు కవలలు కావడం గమనార్హం. అనంతరం పోలీసులు మాధవన్, మధు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ఈ ఘటనలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అని తీవ్ర విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement