టీటీడీ మరో ఉద్యోగి ఆత్మహత్య | TTD Employee Committed Suicide In Tirupati | Sakshi
Sakshi News home page

టీటీడీ మరో ఉద్యోగి ఆత్మహత్య

Jul 29 2018 6:45 PM | Updated on Nov 6 2018 8:16 PM

TTD Employee Committed Suicide In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పనిచేసే ఉద్యోగులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న విజయ్‌ ఆదివారం తన సొంతింట్లోనే తనువు చాలించాడు. తిరుపతి  కొర్లగుంటలోని  మారుతీ నగర్‌కు చెందిన విజయ్‌ ఆత్మహత్యకు పాల్పడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కేవలం నెల రోజుల్లోనే ముగ్గురు టీటీడీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్‌ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement