
సాక్షి, నల్గొండ : యాదగిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో మూడేళ్ల చిన్నారిపై నుంచి పోలీసులు వాహనం దూసుకెళ్లింది. వివరాలు.. యాదగిరి గుట్ట పాత నరసింహస్వామి ఆలయంలో ఈ ఘోరం జరగింది. దేవాలయం ప్రాంగణంలో దైవదర్శనానంతరం తండ్రితో కలిసి ప్రణతి(3) నిద్రిస్తున్న సమయంలో రాచకొండ పోలీసుల వాహనం ప్రణతిపై నుంచి దూసుకెళ్లింది. వెంటనే ఆ చిన్నారిని ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
కామినేని హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రసాద రావు మాట్లాడుతూ.. కడుపులోపల బలమైన గాయం కావడంతో లోపల రక్తం గడ్డ కట్టిందని పేర్కొన్నారు. మెదడుకి కూడా బలమైన గాయం కావడంతో ప్రణీత మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిందన్నారు. హాస్పిటల్‌కి తీసుకొచ్చే సమయానికే పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొన్ని అవయవాలు పనిచేయడం లేదని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. రాచకొండ కమీషన్ మహేష్ భగవత్ ప్రణీతను పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చారు.