రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి | Software Engineer Deceased in Road Accident Guntur | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

Jun 17 2020 1:10 PM | Updated on Jun 17 2020 1:10 PM

Software Engineer Deceased in Road Accident Guntur - Sakshi

మృతుడు నరేంద్ర (ఫైల్‌)

వేల్పూరు(శావల్యాపురం): రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన  ఘటన తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పారా నరేంద్ర(30) స్వగ్రామంలో ఉన్న తన కూతురు జన్మదిన వేడుకల నిమిత్తం హైదరాబాద్‌ నుంచి బైక్‌పై వచ్చాడు. ఈ క్రమంలో కూతురు మొదట సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, తిరిగి మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. మార్గమధ్యంలో మిర్యాలగూడెం జాతీయరహదారిపై ప్రమాదశాత్తు బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి.  ఘటనా స్థలంలోనే నరేంద్ర మృత్యువాత పడ్డాడు. మృతుడి తల్లిదండ్రులు,బంధువులు, గ్రామస్తులు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మిర్యాలగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement