అయ్యా సారూ.. ఏందీ పాడు పని | School Teacher Kidnapped Student At Krishna District | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్‌నకు యత్నం

Jul 19 2018 8:58 AM | Updated on Nov 9 2018 4:36 PM

School Teacher Kidnapped Student At Krishna District - Sakshi

పోతవరప్పాడు (ఆగిరిపల్లి) : పదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్‌కు యత్నించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి ఎస్‌ఐ వి.ఏసేబు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సెక్యూరిటీ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కుమార్తె అదే పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది.

ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న దాసరి గణేష్‌ బుధవారం బాలికకు మాయమాటలు చెప్పి బాలికను తీసుకుని అదృశ్యమయ్యాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఏసేబు ఉపాధ్యాయుడు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఉపాధ్యాయుడు, మైనర్‌ బాలిక రాజమహేంద్రవరంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించి గణేష్‌ను అదుపులోకి తీసుకుని బాలికను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement