చెవి కత్తిరించిన రౌడీ షీటర్‌ అరెస్ట్‌

Rowdy  sheeter ajay held for assault on air hostess - Sakshi

ఎయిర్‌హోస్టెస్‌పై దాడి కేసులో పురోగతి

ఘరానా రౌడీ జాకీ పట్టివేత 

సాక్షి, బెంగళూరు : ప్రేమను నిరాకరించడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్షతో ఎయిర్‌హోస్టెస్‌ చెవి కత్తిరించిన రౌడీషీటర్‌ను యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్‌ చేశారు. జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్న అజయ్‌ కుమార్‌ అలియాస్‌ జాకీని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.  

చదవండి: (ప్రేమించలేదని ఎయిర్‌హోస్టెస్‌ చెవి కట్‌ చేశాడు)

మొదట చైన్‌ దోపిడీ  
గత నెలలో ఎయిర్‌హోస్టెస్, కుటుంబసభ్యులు యశవంతపుర పరిధిలో కారులో వెళుతుండగా రౌడీషీటర్‌ అజయ్‌కుమార్‌ అలియాస్‌ జాకీ అడ్డుకుని బెదిరించి దాడి చేశాడు. బంగారు చైన్‌ లాక్కెళ్లాడు. ఈ ఘటనపై భాదితులు యశవంతపుర పోలీస్‌స్టేషన్‌లో అజయ్‌కుమార్‌ పై ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో అతడు అగ్రహోదగ్రుడయ్యాడు. ఈ నెల 12 తేదీ సాయంత్రం 4.30 సమయంలో ఎయిర్‌హోస్టెస్‌  విధులు ముగించుకుని ఇంటికి క్యాబ్‌లో బయలుదేరింది. 

హెబ్బాల లైప్‌ ఓవర్‌ సిగ్నల్‌ వద్ద క్యాబ్‌ నిలపడంతో పొంచి ఉన్న అజయ్‌కుమార్‌ లోనికి చొరబడి తనను ప్రేమించాలంటూ ఆమెతో గొడవకు దిగాడు. కత్తితో ఆమె చెవిని కట్‌ చేసి అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితురాలు కొడిగేహల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు ఉమ్మడిగా  గాలింపు చర్యలు చేపట్టి దుండగున్ని పట్టుకున్నారు. ప్రస్తుతం యశవంతపుర పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు బాధిత ఎయిర్‌హోస్టెస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top