ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు | Road accident and Uttarakhand CM orders for inquiry | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు

Feb 7 2018 9:42 AM | Updated on Aug 30 2018 4:15 PM

Road accident and Uttarakhand CM orders for inquiry - Sakshi

లోయలో పడి పూర్తిగా ధ్వంసమైన కారు

సాక్షి, డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. కారు లోయలో పడ్డ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని ఛంపావత్‌ సవాలాలో బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింత్ రావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం రావత్ ఆదేశించారు.

ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ప్రయాణిస్తున్న 8మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఛంపావత్‌ సవాలా ప్రాంతానికి రాగానే కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement