పెళ్లినాడే అమ్మాయిని దారుణంగా ఈడ్చుకుంటూ.. | Punjab Bride Being Kidnapped Hours Before Her Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లినాడే వధువు కిడ్నాప్‌

Jan 25 2019 8:16 PM | Updated on Jan 25 2019 8:43 PM

Punjab Bride Being Kidnapped Hours Before Her Wedding - Sakshi

చండీగఢ్‌ : పెళ్లి జరగాల్సిన రోజే యువతి కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు...  ఫజికా జిల్లా ముక్త్‌సర్‌కు చెందిన ఓ యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన సదరు యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో బ్యూటీ పార్లర్‌ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ గమనించగా కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్‌ చేసినట్లు తెలిసింది. సదరు యువతి పార్లర్‌ బయటకు రాగానే ఆమెను అడ్డగించిన దుండగులు బలవంతంగా కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించినప్పటికీ దారుణంగా కొడుతూ కార్లోకి లాక్కెల్లారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల అనుమానం మేరకు కొంతమంది వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement