దారుణం : నార్మల్‌ డెలివరీ చేస్తుండగా.. | Pregnant Women Died In Government Hospital In Jayashankar Bhupalpally District | Sakshi
Sakshi News home page

నార్మల్‌ డెలివరీ చేస్తుండగా బాలింత మృతి

Aug 28 2019 4:37 PM | Updated on Aug 28 2019 4:37 PM

Pregnant Women Died In Government Hospital In Jayashankar Bhupalpally District - Sakshi

సాక్షి, జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల కేంద్ర సివిల్‌ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకుండానే ఓ బాలింతకు నార్మల్‌ డెలివరీ చేయబోయారు ఆస్పత్రి సిబ్బంది. పరిస్థితి విషమించడంతో తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. మొగుళ్లపల్లి మండలం ఎస్‌ పేట గ్రామానికి చెందిన కవిత అనే బాలింత డెలివరీ కోసం సోమవారం ఆస్పత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన సిబ్బంది.. నార్మల్‌ డెలివరీ కోసం లేబర్‌ రూమ్‌కి తరలించారు. ఆస్పత్రిలో పని చేసే గైనకాలజిస్ట్‌ లేకుండానే ఆమెకు నార్మల్‌ డెలివరీ చేయబోయారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి బాలింత మృతి చెందారు. క్రమంలో పరిస్థితి విషమించి బాలింత మృతి చెందారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తల్లి, కూతురు మృతి చెందారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బంధువులతో కలిసి ఆస్పత్రి అద్దాలు, పర్నీచర్‌ పగులగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement