పోస్టుమార్టం నివేదికే కీలకం | Post Mortem Report Decides Swamiji Death Case Karnataka | Sakshi
Sakshi News home page

పోస్టుమార్టం నివేదికే కీలకం

Jul 27 2018 8:55 AM | Updated on Jul 27 2018 8:55 AM

Post Mortem Report Decides Swamiji Death Case Karnataka - Sakshi

రమ్యాశెట్టి , శిరూరు స్వామి (ఫైల్‌)

యశవంతపుర : ఉడిచి శిరూరు లక్ష్మీవర తీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసులో ఇప్పుడు పోస్టుమార్టం నివేదికే కీలకంగా మారింది. నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. శనివారంలోపు నివేదిక వచ్చే అవకాశం ఉంది. అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వామికి ఆప్తురాలిగా భావిస్తున్న రమ్యాశెట్టి స్నేహితుడు ఇక్బాల్‌ (45)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రమ్యాశెట్టి పోలీసుల అదుపులో ఉన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే పోస్టుమార్టం నివేదిక తరువాత ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. అప్పుడే శాస్త్రీంగా దర్యాప్తు మొదలువుతుందని పోలీసులు చెబుతున్నారు.

డీవీర్‌ నిపుణులు రాక : సీసీ కెమెరా డీవీఆర్‌ను పరిశీలించడానికి బెంగళూరు నుంచి నిపుణులను రప్పించారు. ఇదే కీలక సాక్ష్యంగా పోలీసులకు ఉపయోగపడనుంది. అదే విధంగా తరచూ మఠానికి వచ్చిపోయే భక్తుల వివరాలు సేకరించారు. ముంబైకు రెండు బృందాలను పంపించారు. పశ్చిమ విభాగం ఐజీ అరుణ్‌ చక్రవర్తి, ఎస్‌పీ నింబర్గిలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్వామీజీ వైకుంఠ ఆరాధన 31న మూల మఠంలో నిర్వహించాలని నిర్ణయించారు.

రూ. కోటి బంగారం భద్రం : స్వామి వద్దనున్న కోటి విలువ గల బంగారు అభరణాలు భద్రంగా ఉన్నట్లు ఉడిపి పోలీసులు తెలిపారు. బంగారు నగలను ఎవరూ దోచుకెళ్లలేదని, ఆయన ఆస్పత్రికి చేరే ముందు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలతో పోలీసులు సతమతమవుతున్నారు. మరో అనుమానితుడు బులెట్‌ గణేశ్‌ను అదుపలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement