కుక్క కోసం కత్తిపోట్లు | People Fought For Pet Dog In Venkatagiri Nellore | Sakshi
Sakshi News home page

కుక్క కోసం కత్తిపోట్లు

Jul 25 2019 12:55 PM | Updated on Jul 25 2019 1:00 PM

People Fought For Pet Dog In Venkatagiri Nellore - Sakshi

సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): పెంపుడు కుక్క విషయమై ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. చినికి చినికి గాలివానలా మారి చివరికి ముగ్గురు కత్తి పోట్లుకు గురైన ఘటన మంగళవారం రాత్రి వెంకటగిరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని బొగ్గులమిట్ట ప్రాంతానికి చెందిన వినోద్, గణేష్‌ తమ బాబాయి వీరాస్వామి చెందిన పెంపుడు కుక్క తప్పిపోవడంతో వెతుక్కుంటూ రాగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గీతాంజలి కుమార్తె తులసి వద్ద కుక్క ఉండాన్ని గమనించారు. వినోద్, గణేష్‌లు తులసి, గీతాంజలిలను కుక్క విషయమై ప్రశ్నించే క్రమంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తులసి సోదరుడు సాయికిషోర్‌ ఒకింత ఆగ్రహంతో వినోద్, గణేష్‌పై దాడి చేశాడు.

దీంతో వినోద్, సాయిగణేష్‌  పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే బొగ్గులమిట్టలో వివాదం మరింత తీవ్రమైంది. గణేష్, వినోద్‌పై దాడి చేశారన్న సమాచారం అందుకున్న వారి బాబాయి వీరాస్వామి గీతాంజలి ఇంటి వద్దకు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వీరాస్వామి కత్తితో గీతాంజలి, తులసి, సాయి కిషోర్‌పై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం తిరుపతి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement