
జగదేవ్‌పూర్(గజ్వేల్): విద్యుత్ షాక్‌తో జాతీయ పక్షి నెమలి మృతి చెందిన సంఘటన మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం గ్రామ సమీపంలోని రోడ్డు దాటుతున్న క్రమంలో అప్పుడే వస్తున్న ప్రజలను, వాహనాలను చూసి బెదిరి పైకి ఎగిరింది. ఈ క్రమంలో పైన విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై కింద పడి చనిపోయింది. ఈ విషయమై గ్రామస్తులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఫారెస్టు రేంజ్ అధికారి కిరణ్, పశువైద్యాధికారితో పోస్ట్‌మార్టం చేయించారు. అనంతరం నెమలిని అటవీ ప్రాంతంలో పూడ్చివేశారు.