మళ్లీ బరితెగించిన పాక్..

Pak Terrorists attacks at Maharaja Hari Singh hospital in Srinagar - Sakshi

శ్రీనగర్‌లోని హాస్పిటల్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదులు కాల్పులు

సాక్షి, శ్రీనగర్: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ ఉగ్రవాదులు కాల్పులు జరిపి భారత ఆర్మీ లెఫ్టినెంట్‌ అధికారి, ముగ్గురు జవాన్లను పొట్టన పెట్టుకున్న ఘటన మరువక ముందే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని మహారాజా హరిసింగ్ హాస్పిటల్‌లోకి ప్రవేశించిన కొందరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఉగ్రవాదుల కాల్పులకు భయపడి రోగులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఉగ్రవాదుల ఆకస్మిక కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top