కూర రాజన్నకు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ | Non-bailable warrant for Kura Rajanna | Sakshi
Sakshi News home page

కూర రాజన్నకు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

Feb 20 2018 3:16 AM | Updated on Oct 17 2018 6:34 PM

Non-bailable warrant for Kura Rajanna - Sakshi

సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి ఉద్యమ నిర్మాత కూర రాజన్న(70)కు రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సోమవారం నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. కోనరావుపేట మండలం సుద్దాలలో ఏనుగు ప్రభాకర్‌రావు హత్య కేసులో రాజన్న నిందితుడు. 2013 నాటి ఈ కేసులో రాజన్న కోర్టుకు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ తొమ్మిదో జిల్లా కోర్టు న్యాయ మూర్తి జి.శ్రీనివాసులు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు. వేములవాడకు చెందిన కూర రాజేందర్‌ ఉరఫ్‌ కూర రాజన్న జనశక్తి ఉద్యమ నిర్మాత. ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement