సంగీత దర్శకుడిపై అత్యాచారం కేసు | Molestation Case Files Against Music Director In karnataka | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడిపై అత్యాచారం కేసు

Nov 28 2018 12:25 PM | Updated on Nov 28 2018 12:25 PM

Molestation Case Files Against Music Director In karnataka - Sakshi

కర్ణాటక, కృష్ణరాజపురం, యశవంతపుర :  ప్రేమించి మోసం చేయడంతో పాటు మరొక యువకుడితో కుదర్చుకున్న వివాహం రద్దు కావడానికి కారణమైనందుకు ఓ యువతి ఫిర్యాదు మేరకు జ్ఞానభారతి పోలీసులు సంగీత దర్శకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసుకున్నారు. గూళిహట్టి చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన మహదేవ్‌ కరణ్‌ రెండేళ్ల క్రితం బెంగళూరు నగరానికి చెందిన ఓ యువతి పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే యువతి ఇంట్లో ఇరువురి ప్రేమను వ్యతిరేకించడంతో అప్పటి నుంచి యువతి మహదేవ్‌కు దూరంగా ఉండసాగింది.

దీంతోపాటు కొద్ది రోజుల క్రితం యువతికి మరొక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహదేవ్‌ యువకుడికి ఫోన్‌ చేసి యువతితో సాగించిన ప్రేమాయణాన్ని వివరించాడు. దీంతో యువకుడు యువతితో చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాడు. దీనంతటికి సంగీత దర్శకుడు మహదేవ్‌ కారణమని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువతితో జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు మహదేవ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement