
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడిని కడతేర్చాడో కసాయి భర్త. భార్యను ఇనపరాడ్డుతో కొట్టి, కొడుకుని బకెట్‌లో ముంచి చంపాడు. నిందితుడు జింకలవాడకు చెందిన రాజేశ్‌గా గుర్తించారు.రాజేష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని దేవారియా గ్రామంగా గుర్తించారు. బతుకు తెరువుకోసం యూపి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాజేష్.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.