
గాయపడ్డ సత్యనారాయణ
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): నగరంలోని వినాయక్‌నగర్ రాజీవ్‌గాంధీ చౌరస్తాలో బోరు వాహనం ఢీ కొని ఒకరు తీవ్రగాయాల పా లయ్యాడు. వినాయక కల్యాణ మండపం వద్ద నివాసం ఉండే సుంకోజ్ సత్యనారాయణ(58) ఆర్యనగర్‌లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేశాడు. శుక్రవారం ఇల్లుకు మరమ్మతు పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటి వైపు తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా రాజీవ్‌గాంధీ చౌర స్తా వద్ద 100 ఫీట్ల రోడ్డు వైపు వెళ్తున్న బోరు లారీ సత్యనారాయణను ఢీకొట్టింది. దీంతో అతను కిందపడి పోగా వెనుక చక్రాలు అతని ఎడమ కా లుపై నుంచి వెళ్తూ ద్విచక్ర వాహనంతో పాటు ఫర్లాంగ్ దూరం ఈడ్చుకు వెళ్లింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో లారీని డ్రైవర్ నిలిపివేశాడు.
స్థానికులు సత్యనారాయణను లారీ కింద నుంచి బయటకు తీయ గా అతని కాలు నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయా డు. ఎస్సై శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.